2 ) కల్కి 2898 ఏ.డీ: ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ రూ. 1100 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి రెండు సార్లు (బాహుబలి 2, కల్కి 2898 ఏ.డీ) చేరిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
3 ) దేవర: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో దేవర, వరగా రెండు పాత్రల్లో అభిమానులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా దాదాపు రూ.450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకూ కొనసాగింపుగా పార్ట్ 2 త్వరలోనే సెట్స్ మీదకు రానుంది.
4 ) హను-మాన్: తేజసజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ దర్శకుడి సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది మొదటి సినిమా. దీనికి కొనసాగింపు గా జై హనుమాన్ ఉండనుంది.
5 )గుంటూరు కారం: మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దాదాపు 15 ఏళ్లకు ‘గుంటూరు కారం’. వచ్చింది. అంచనాలు అందుకోలేకపోయినా కూడా ఈ సినిమా రు. 170 కోట్లు రాబట్టింది.
6 ) టిల్లు స్క్వేర్: ‘ డీజే టిల్లు ’ కి కొనసాగింపుగా వచ్చిన రెండో భాగం ‘ టిల్లు స్క్వేర్ ’. సిద్ధు జొన్నలగడ్డ మార్క్ మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది.