కన్నడ హీరో సుదీప్ కు సౌత్ ఇండియా అంతటా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఈగ సినిమాలో విలన్ గా నటించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరో పాపులారిటీని పెంచుకున్నారు. సుదీప్ గత సినిమా విక్రాంత్ రోణ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పలు సినిమాలలో గెస్ట్ రోల్స్ లో కూడా నటించిన సుదీప్ ఈరోజు విడుదలైన మ్యాక్స్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో చూద్దాం.
 
 
కథ :
 
అర్జున్ అలియాస్ మ్యాక్స్ (కిచ్చా సుదీప్) సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పని చేయడానికి తల్లితో కొత్త ఊరికి వస్తున్న తరుణంలో వీర, మైఖేల్ అనే రాజకీయ నాయకుల కొడుకులు మహిళా పోలీస్ తో అసభ్యంగా ప్రవర్తించడం చూసి వాళ్లను మ్యాక్స్ అరెస్ట్ చేస్తాడు. వీర, మేఖేల్ లను అరెస్ట్ చేశారని తెలిసి రాజకీయ నాయకుల అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడి చేయడానికి ప్రయత్నించగా అదే సమయంలో జైలులో ఉన్న వీర, మైఖేల్ మరణిస్తారు.
 
వీర, మైఖేల్ మరణానికి కారణాలేమిటి? మ్యాక్స్, అతని బృందానికి క్రైమ్ డిపార్టుమెంట్ సీఐ (రూప) కలిగించిన ఇబ్బందులేంటి? తనకు ఎదురైన సమస్యలను మ్యాక్స్ ఎలా పరిష్కరించాడు? అనే ప్రశ్నలకు జవాబే ఈ సినిమా కథ.
 
విశ్లేషణ :
 
కేవలం 24 గంటల్లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరక్క్కింది. సుదీప్ తన అద్భుతమైన నటనతో ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ విజయ్ అద్భుతమైన కథనంతో మెప్పించారు. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ఊహలకు అందని విధంగా ఉంది. సుదీప్ ఇమేజ్ స్వాగ్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. వరలక్ష్మీ శరత్ కుమార్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అజనీష్ లోకనాథ్ సాంగ్స్ తో మెప్పించలేకపోయినా బీజీఎంతో మెప్పించారు.
 
ప్లస్ పాయింట్స్ : సుదీప్ నటన, అజనీష్ లోకనాథ్ బీజీఎం, క్లైమాక్స్ ట్విస్ట్
 
మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు, సంగీతం, క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా లేకపోవడం
 
రేటింగ్ : 2.75/5.0
 


మరింత సమాచారం తెలుసుకోండి:

max