కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఆమె నటించిన "బేబీ జాన్" సినిమా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయింది . అయితే సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోయింది . వరుణ్ ధావన్ కి నటనపరంగా మంచి మార్కులు వచ్చినా కీర్తి సురేష్ కి మాత్రం నటన పరంగా జీరో మార్కులు వేసేసారు బాలీవుడ్ జనాలు . బాలీవుడ్ లెవెల్ లో ఎక్స్పోజింగ్ లేదు .. ఆ టాలెంట్ ఆమెకు లేనేలేదు అంటూ కొట్టి పడేసారు. ఇక క్రిటిక్స్ అయితే కీర్తి సురేష్ నటనపై దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .
ఎన్నో ఊహలతో అంచనాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ కెరియర్ బొక్క బోర్లా పడినట్లు అయింది . మరికొందరు ఆమె పెళ్లి విషయాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు . అనవసరంగా పెళ్లి చేసుకొని తప్పు చేసింది అని పెళ్లి కారణంగా కూడా ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలు ఈ సినిమా హిట్ ఇవ్వలేకపోయారు అని .. ఎలాగో పెళ్లి చేసుకుంది ఇక ఎక్స్పోజింగ్ సీన్స్ ఏం చేస్తుంది అంటూ ఈ సినిమా విషయంలో ఆమెకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు అంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్ళాక టాలీవుడ్ సినిమాలను ఒప్పుకోకుండా తెలుగు జనాలను నెగ్లెట్ చేసింది అన్న కామెంట్స్ వినిపించిన కీర్తి సురేష్ పై ఇప్పుడు దూల తీరిపోయింది అంటూ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు కొందరు ఆకతాయిలు. సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు హ్యూజ్ రేంజ్ ట్రోల్లింగ్ కి గురవుతుంది..!