- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


సీడెడ్ ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాలలో ఇటీవ‌ల కాలంలో అన్నీ సినిమాల‌కు మంచి బిజినెస్ జ‌రుగుతోంది. సినిమా ల వ‌సూళ్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా వ‌చ్చిన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ భారీ వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు సీడెడ్ లో ఈ సినిమా రు. 31.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. ఈ ప్రాంతంలో 51.04 కోట్ల గ్రాస్ తో మొదటి స్థానంలో రామ్ చ‌ర‌ణ్ - జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఉంది. దీని తర్వాత రెండో స్థానంలో 34.75 కోట్ల గ్రాస్ తో బాహుబలి 2 నిలిచింది.


ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ దేవర 1 సినిమా రు. 31.85 కోట్ల కలెక్షన్ల‌ తో మొన్నటి వరకు టాప్ - 3 లో ఉండేది. పుష్ప 2 ఈ వసూళ్లని క్రాస్ చేసింది. దీంతో దేవ‌ర ప్లేస్ కాస్త వెన‌క్కు వ‌చ్చింది. ఇక ప్ర‌భాస్ స‌లార్ 1 5వ స్థానంలో ఉంది. ఈ సినిమా లాంగ్ ర‌న్ లో అక్క‌డ 22.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక టాప్ 6లో బాహుబలి 1 మూవీ 21.8 కోట్ల గ్రాస్ తో ఉంది. ఇక పుష్ప 2 క‌లెక్ష‌న్లు ఆల్ మోస్ట్ చివరి ద‌శ‌కు వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలో పుష్ప 2 త్రిబుల్ ఆర్ - బాహుబ‌లి 2 ను సీడెడ్‌లో బ్రేక్ చేసే ఛాన్సే లేదు.


సీడెడ్ క‌లెక్ష‌న్లు టాప్ - 10 సినిమాలు :
1 ) ఆర్ఆర్ఆర్ మూవీ – 51.04 కోట్లు
2 )బాహుబలి 2 - 34.75 కోట్లు
3 )పుష్ప 2 - 31.95 కోట్లు
4 ) దేవర పార్ట్ 1 - 31.85 కోట్లు
5 )సలార్ పార్ట్ 1 - 22.75 కోట్లు
6 ) బాహుబలి - 21.8 కోట్లు
7 ) కల్కి 2898 ఏడీ - 21.80 కోట్లు
8 ) సైరా - 19.11 కోట్లు
9 ) వాల్తేరు వీరయ్య - 18.35 కోట్లు
10 ) అల వైకుంఠపురములో - 18.27 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: