అయితే ఇదే క్రమంలో ఈ విషయాన్ని పొలిటికల్ పరంగా కూడా లాగుతున్నారు కొంతమంది పొలిటీషియన్స్ . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ పేరు చెప్పుకొని పాలిటిక్స్ చేస్తున్నారు . అయితే తాజాగా సిపిఐ నారాయణ చేసిన కామెంట్స్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . పుష్ప2 కధని.. కంటెంట్ ని ఏకిపారేసిన సిపిఐ నారాయణ రష్మిక పేరును కూడా మధ్యలోకి లాక్కొచ్చారు . "రష్మిక కూడా చెప్పకనే చెప్పేసింది అని ..నాకు ఇష్టం లేదు ఫీలింగ్స్ పాటుకు డాన్స్ చేయడం ..కానీ తప్పనిసరిగా నిర్మాత బలవంతంతోనే ఇలా చేశాను అని ..నిర్మాత ప్రోత్సహించడంతో నేను పీలింగ్స్ పాటలో అంత కష్టమైన స్టెప్స్ కూడా వేయాల్సి వచ్చింది అంటూ చెప్పింది అని మహిళలంతా ఆత్మ అభిమానం చంపుకొని ఆ కళాపోషణలో ఉన్నారు అని "షాకింగ్ కామెంట్స్ చేశారు .
సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి . అయితే ఆరోజు సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్నా కూడా ఉంది అని .. ఎందుకు రష్మిక మందన్నాని వదిలేశారు అని ..రష్మికని కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టేయాలి అని కొంతమంది ఘాటుగా మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది అల్లు అర్జున్ ప్రాబ్లమ్స్ లో ఉంటే రష్మిక మందన్నా - విజయ్ దేవరకొండతో ఎంజాయ్ చేస్తుంది అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఊహించిన చిక్కుల్లో రష్మిక మందన బాగానే ఇరుక్కునేసింది..!