రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు..2024 ఫిబ్రవరి 21న రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల నుండి తన ప్రేమిస్తున్న బాలీవుడ్ నిర్మాత నటుడు అయినటువంటి జాకీ బాగ్నాని పెళ్లి చేసుకుంది. ఎన్నో రోజుల ప్రేమకి పెళ్లి బంధంతో ముగింపు పలిగింది.ఇక పెళ్లి తర్వాత సౌత్లో అంతగా అవకాశాలు లేని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే జిమ్ములో కష్టపడుతూ జీరో సైజ్ మెయింటైన్ చేస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పై ఆ మధ్య కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

అదేంటంటే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి ఓ రాజకీయ నాయకుడు 10 కోట్లు పంపినట్టు ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ జాకి భగ్నానీల పెళ్ళికి బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ 10 కోట్లు సీక్రెట్ గా ముట్టజెప్పినట్టు ఒక పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ పోస్టులో ఏముందంటే.. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ నుండి దాదాపు 10 కోట్ల వరకు డబ్బులు హవాలా రూపంలో ఇచ్చినట్టు విచారణలో తెలిసింది.

 అయితే కేటీఆర్ చెప్పడం వల్లే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి 10 కోట్ల రూపాయలు ఇచ్చామన్నట్టు ఆ సంస్థ వాళ్ళు విచారణలో తెలిపినట్టు ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఆ పోస్ట్ పూర్తిగా ఫేక్ న్యూస్ అని అది ఎవరు నమ్మవద్దు అంటూ సజాగ్ టీం ఆ వార్తను కొట్టి పారేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇది మాత్రమే కాదు రకుల్ ప్రీత్ సింగ్ కి కేటీఆర్ కి మధ్య అప్పట్లో చాలానే రూమర్స్ చక్కర్లు కొట్టాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: