సాధారణంగా చిరుని మంచి కథతో మెప్పించడం అంత ఈజీ కాదు కానీ దసరా హిట్ ఇచ్చాడు కాబట్టి చిరు అతని మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఐతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే కోలీవుడ్ డైరెక్టర్ మిత్రన్ తో సినిమా లైన్ లో పెడుతున్నాడట. మిత్రన్ తమిళ్ లో తన మార్క్ సినిమాలతో మెప్పిస్తున్నాడు.
సర్ధార్ సినిమాతో సత్తా చాటి ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ కి సిద్ధమవుతున్న మిత్రన్ మెగాస్టార్ తో సినిమా చేయడం క్రేజీ థింగ్ అనిపిస్తుంది. తప్పకుండా ఈ కాంబో అదిరిపోతుందని చెప్పొచ్చు. మెగాస్టార్ ప్లానింగ్ అయితే బాగుంది కానీ ఈ సినిమాలు ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతాయా అని ఫ్యాన్స్ టెన్షన్ పెట్టుకున్నారు. చిరు విశ్వంభర పూర్తి అవ్వడం ఆలస్యం ఈ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. చిరు కూడా మిగతా హీరోల్లానే సినిమాల వేగం పెంచుతున్నాడని తెలుస్తుంది. చిరంజీవి తో సినిమాల కోసం మిగతా దర్శకులు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా యువ దర్శకులతో మాత్రం లెక్క తప్పకుండా చూడాలని అనుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం చిరు సినిమాల లైనప్ చూసి ఖుషి అవుతున్నారు. విశ్వంభర 2025 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తుండగా నెక్స్ట్ సినిమాలు అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.