అందుకే ఇప్పుడు విలన్ రోల్స్ కి కూడా అన్ని ఇండస్ట్రీలో భారీగానే డిమాండ్ పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక స్టార్ హీరో విలన్ గా నటించడానికి 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు రాకింగ్ స్టార్ యష్. కేవలం కే జి ఎఫ్ అనే చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ అందుకున్న యష్ .. 2007లో కన్నడ చిత్రం జంపతహుడికి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దీంతో కన్నడ సినీ ఇండస్ట్రీలో బ్రాండ్ ఏర్పరచుకున్న ఈ నటుడు కేజిఎఫ్ సిరీష్ తో భారీ క్రేజ్ అందుకున్నారు.
ప్రస్తుతం డైరెక్టర్ గీతు మోహన్ దాస్ డైరెక్షన్లో టాక్సిక్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. అలాగే హిందీలో డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణం చిత్రంలో రావణుడు పాత్రలో నటించబోతున్నారు.. ఈ సినిమాలో నటించినందుకు గాను సుమారుగా 200 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తూ ఉన్నారు.. 2026 దీపావళికి ఈ సినిమాని విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. మొత్తానికి ఇండియాలోని అత్యధికంగా విలన్ గా రెమ్యూనరేషన్ తీసుకొని నటుడుగా పేరు సంపాదించారు యష్.