అయితే రేవంత్ రెడ్డిని, సినీ ప్రముఖులకు కలిశారు. ఈ మీటింగ్ లో సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై ప్రధానంగా చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఇండస్ట్రీ తరఫున ఏ ఒక్క మహిళ డైరెక్టర్ కానీ, నటి కానీ పాల్గొనలేదు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగిన భేటీపై పూనమ్ కౌర్ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రితో కలిసేందుకు వెళ్లిన వారిలో ఇండస్ట్రీ నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడంపై ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవంటూ పూనమ్ కౌర్ విమర్శలు చేసింది. కేవలం హీరోలకు, బిజినెస్ గురించి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుందని రాసుకొచ్చింది. తాజా పరిస్థితి చూస్తే ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు ఎలాంటి సమస్యలు లేవని అర్థమవుతోందని విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఉండే అర్హత మహిళలకు లేదా అని ఫైర్ అయ్యింది. మహిళలకు ఎటువంటి సమస్యలు ఉండవు, హీరోకి సమస్య వచ్చినప్పుడు మాత్రమే పరిశ్రమ నిలుస్తుందని మండిపడింది. మహిళలకు సమస్యలు లేవని.. ఎవరికీ అలాంటి సమస్యలు ఉండవని పూనమ్ కౌర్ వెల్లడించారు.