అయితే ఈ మీటింగ్ కి చిరంజీవి లాంటి పెద్దమనిషి రాకపోవడం సంచలనంగా మారింది . కొన్ని అనివార్య కారణాల చేతే చిరంజీవి ఈ మీటింగ్ కి రాలేకపోయాడు అంటూ కూడా క్లారిటీకి వచ్చేసింది . అయితే మా ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు ఈ మీటింగ్ కి ఎందుకు రాలేదు ..? నిజానికి ఈ మీటింగ్ కి ఎవరు అటెండ్ అయినా కాకపోయినా మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు కచ్చితంగా అటెండ్ అవ్వాలి . అదే ఆయన పొజిషన్ కి ఉన్న వాల్యూ. మరి మంచు విష్ణు ఎందుకు అటెండ్ అవ్వలేదు..? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్విట్ చేసి అల్లు అర్జున్ విషయంలో ఎవరు స్పందించకపోవడం బెస్ట్ అనే విధంగా పరోక్షంగా చెప్పుకు వచ్చిన ఆయన మా ప్రెసిడెంట్ అయి ఉండి ఎందుకు రేవంత్ రెడ్డి మీటింగ్లో పాల్గొనలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు . అయితే చాలామంది మోహన్ బాబు ఫ్యామిలీలో ఇష్యూస్ కారణంగానే మంచు విష్ణు అటెండ్ అవ్వలేదు అంటుంటే .. మరి కొంతమంది మాత్రం ఆయన కన్నప్ప సినిమాలో టూ టూ బిజీగా ఉన్నాడు అని ..కన్నప్ప సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు అని ..ఆ కారణంగానే సింగిల్ డే కాల్ షీట్స్ కూడా మిస్ చేసుకోకుండా చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నారు అని.. ఆ కారణంగానే మంచు విష్ణు ..సీఎం రేవంత్ రెడ్డి తో మీటింగ్ కి అటెండ్ కాలేకపోయాడు అంటూ వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. దీనితో మంచు విష్ణు పేరు మరోసారి ట్రోల్లింగ్ కి గురవుతుంది.