చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ నటుడుగా ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడు వివాదాస్పదంగానే మారేది. 1978లో నటి క్లాసికల్ నృత్యకారుని అయిన వాణి గణపతిని కమల్ హాసన్ పెళ్లి చేసుకున్నారు .. అయితే వాణికి విడాకులు ఇచ్చే ముందే కమల్ మరో హీరోయిన్ సారికతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి .. 1988లో కమల్ వాణి విడిపోయారు .. వాణి గణపతికి విడాకులు ఇచ్చిన తర్వాత తనకు పెళ్లి మీద నమ్మకం పోయిందని కమల్ హాసన్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అలాగే అదే ఇంటర్వ్యూలో పెళ్లి నాకు సంతోషాన్ని ఇవ్వలేదు .. నేను అబద్ధం చెప్పను .. చాలా బాధాకరం .. నేను ఇప్పుడు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను .. అప్పటికి నాకు పెళ్లి అనే వ్యవస్థ మీద నమ్మకం పోయింది .. నేను ఎప్పుడూ ధైర్యంగా మాట్లాడను మొదటి రోజు నాకు సెట్ కాలేదని చెప్పాను అని ఆయన అన్నారు.
ఇదే క్రమంలో కమలహాసన్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్న సమయంలో హీరోయిన్ సారికతో డేటింగ్ మొదలు పెట్టారని ఇద్దరూ కలిసి జీవిస్తున్నారని ప్రచారం కూడా గట్టిగా జరిగింది .. 1988లో కమల్ సారికను పెళ్లి చేసుకున్నారు .. వీరికి శృతిహాసన్ , అక్షర హాసన్ అనే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.. అయితే సారికతో కూడా కమలహాసన్ ఎక్కువకాలం ఉండలేకపోయా.. వీరు కూడా 2004లో విడాకులు తీసుకుని విడిపోయారు. సారికకు విడాకులు ఇచ్చిన తర్వాత చాలా కాలం మౌనంగా ఉన్న కమల్ హాసన్ 2017 లో ఒక ఇంటర్వ్యూలో వాణికి ఇచ్చిన విడాకులు తనను దివాలా తీసేలా చేశాయని అన్నారు.
అయితే దీనిపై వాణి గణపతి గతంలో స్పందిస్తూ.. మేమిద్దరం విడాకులు తీసుకుని 28 సంవత్సరాలు అవుతుంది .. నేను దీని గురించి ఎప్పుడూ మాట్లాడను .. ఎందుకంటే అది మా వ్యక్తిగత విషయం. మేమిద్దరం ఇప్పుడు విడిపోయాం కానీ .. కమల్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అర్థం కావటం లేదు. అదే మేమిద్దరం పెళ్లి చేసుకున్న సమయంలో మా ఉమ్మడి ఇంటి నుంచి వాడిన వస్తువులు కూడా నాకు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు .. అలాంటి వ్యక్తి నుంచి నేను ఏమి ఆశించగలను ? ఇప్పుడు ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నాం .. ఆమె అన్నారు .. ఇప్పుడు గతంలో కమలహాసన్ వాణి గణపతికి సంబంధించిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి.