టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కి సరైన హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక దాంతో మంచి విజయం కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు .. రీసెంట్ గానే శ్రీను వైట్లతో విశ్వం సినిమా చేశారు ఇది కూడా ఆయనకు ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు .. శ్రీనువైట్ల అప్పటికే అవకాశం లేక ఖాళీగా ఉన్నా కూడా అదే సమయంలో గోపీచంద్ అవకాశం ఇవ్వటంతో విశ్వం మూవీ తెరకెక్కింది .. ఇద్దరూ ప్లాప్‌ల‌లో ఉండడంతో ఒకరికి ఒకరు ఛాన్స్ ఇచ్చినట్టు అయింది.


సినిమా హిట్ అయితే ఇద్దరు ప్లాప్‌ భయాల నుంచి బయటపడే అవకాశం ఉండేది .. కానీ ఫలితం ఇద్దరికీ భారీ షాక్ ఇచ్చింది .. అయినా కూడా గోపీచంద్ మరో ప్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. దర్శకుడు మరెవరే కాదు డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీకి సక్సెస్ చూడలేదు .. ఈ సంవత్సరం వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా సరైన ఫలితం అందుకోలేక పోయింది .. ఇక దాంతో పూరి పనైపోయిందని విమర్శలతో పాటు అతడు కం బ్యాక్ కొత్త కాదు అనే వాదన ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తుంది.


ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ కం బ్యాక్ కోసం గోపీచంద్ ను హీరోగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది .. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సంవత్సరం ఓ మూవీ  షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది .. ఇప్పటికే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాట.. ఇక ఇద్దరూ ఫ్లాఫుల్లో ఉన్నారు కాబట్టి దీంతో మరోసారి ఇద్దరు ఒకరికి ఒకరు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది .. గతంలో కూడా ఈ ఇద్దరి కాంబినేషన్లో గోలీమార్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే .. ఆ సమయంలో పూరి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆ స‌మ‌యంలో భారీ అంచ‌న‌ల మధ్య వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్ని సంవత్సరాలు తర్వాత ఇద్దరి అపజయాలు వీరిని కలిపింది .. మరి ఇద్దరికీ ఈ సినిమా గొప్ప కం బ్యాక్ ఇస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: