దేవి అఫీషియల్ గా టీవీ9 నుంచి బయటకు వచ్చేసింది. గురువారం రోజున టీవీ9 మేనేజ్మెంట్ ఫేర్వెల్ కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దేవి ఆ ఫోటోలను తన ఫేస్బుక్, ఇన్ స్టా ఖాతాలలో పోస్ట్ చేసుకుంది. అందులో రజనీకాంత్, సత్య, శిరీష, దీప్తి, ప్రణీత ఇంకా చాలామంది ఉన్నారు. టీవీ9 టీమ్ తెప్పించిన కేక్ ను దేవి కట్ చేసింది. ఆల్ ది బెస్ట్ దేవీ నాగవల్లి.... ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అని ఆ కేక్ మీద రాసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు దేవి సినిమాల్లోకి అడుగుపెడుతున్నట్లుగా ఇన్ డైరెక్ట్ గా వెల్లడించింది.
అయితే అక్కడ కూడా జీరో నుంచి మొదలు పెడతాను అంటూ వెల్లడించింది. మీడియాలోనూ జీరో నుంచి మొదలుపెట్టి ఇప్పుడు గొప్ప స్థాయికి వచ్చానని చెప్పింది. అప్పటివరకు మీడియాకు దూరంగా ఉంటానని, సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని దేవి క్లారిటీగా చెప్పేసింది. ఈ మేరకు తన తోటి ఉద్యోగులు ఇచ్చిన ఫేర్ వెల్ పార్టీ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకుంది. దేవి ప్రస్తుతం మీడియాని వదిలేసి సినిమాలోకి వెళ్తోంది.
ఈ మెరకు సుకుమార్ గత నెలలోనే హింట్ ఇచ్చేశాడు. పుష్ప-2 కోసం దేవి నాగవల్లి పని చేసిందట. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన వద్ద దేవి పని చేసిందని సుకుమార్ అన్నారు. దేవి వద్ద చాలా కథలు ఉన్నాయని, భవిష్యత్తులో ఆమె కథతోనే సినిమాని కూడా తీయొచ్చు అంటూ సుకుమార్ ఆమెకు చాలా హైప్ ఇచ్చాడు. మీడియాను వదిలి సినిమాల్లోకి వచ్చేస్తుందంటూ దేవి నాగవల్లి గురించి సుకుమార్ చెప్పాడు. ఇప్పుడు దేవీ నాగవల్లి మీడియా నుంచి బయటకు రావడం హాట్ టాపిక్ అవుతోంది.