భారత స్టార్ బ్యాట్మెంటన్ రెండుసార్లు ఒలంపిక్ విజేత పివి . సింధు తాజాగాడిసెంబర్ 22న హైదరాబాద్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయపూర్ లో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఆ తర్వాత రిసెప్షన్ హైదరాబాద్లో జరిగింది. వీరి రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత తొలిసారిగా మాట్లాడిన సిందు నా జీవితంలో స్థిరత్వం కోసం గొప్ప ప్రయత్నమీదని అందుకే ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత 2024లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పకు వచ్చింది. పెళ్లి అంటే ఓ స్థిరత్వం.. గతం కంటే మరింత మెరిగ్గా పని చేయడంలో సహాయపడేది స్థిరత్వం అని సింధు చెప్పుకొచ్చింది ..


 అత్యున్నత స్థాయిలో పోటీకి దిగటం చాలా కఠిన స్థరమైనది .. ఆ భద్రత మద్దతు పెళ్లితో ఆడావారి జీవితానికి దక్కుతుంది. జీవితంలో ఈ కొత్త దశ చాలా ప్రత్యేకంగా అనిపించిందని సింధు చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం పీవీ సింధు .. దత్త సాయి జంట నికర ఆస్తుల గురించి సోషల్ మీడియా రకరకాల వార్తలు బయటికి వస్తున్నాయి .. అందుతున్న సమాచారం ప్రకారం సింధు నికర ఆస్తులు విలువ 60 కోట్లు (7.1 మిలియన్ డాలర్లు) అలాగే మన ఇండియాలోనే అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా క్రీడాకారులు ఒకరిగా పీవీ సింధు పేరు కూడా వినిపిస్తుంది. ఆటలతో పాటు కమర్షియల్ ప్రకటనలతో కూడా సింధు భారీగా సంపాదించింది. అలాగే సింధుకు హైదరాబాదులో విలాసవంతమైన హిల్ టాప్ హోమ్ నీ కూడా నిర్మించుకుంది. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా పెట్టింది.


అక్కినేని నాగార్జున బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ x5, ఆనంద్ మహీంద్రా కానుకిచ్చిన మహీంద్రా థార్ స‌హ పలు కారులు ఆమె దగ్గర ఉన్నయి . ఇక 2019లో సింధు చైనీస్ బ్రాండ్ లీ నింగ్‌తో 50 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. మేబెల్లైన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏషియన్ పెయింట్స్ స‌హ ప‌లు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా సింధుకు నాలుగు మిలియన్ కు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక సింధు భర్త వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ .. ఇతను నికర ఆస్తులు విలువ సుమారు 150 కోట్లు.. దత్త సాయికి క్రీడలు అంటే ఎంతో ఇష్టం తన కార్పొరేట్ నైపుణ్యాన్ని క్రీడలతో మిళితం చేశాడు.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కు మాజీ ఆపరేషన్ లీడ్‌గా కూడా పనిచేశారు .. సింధు - దత్త సాయి ఆస్తులు విలువ సుమారు 200 కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: