అసలు మహేష్ బాబు - అల్లు అర్జున్ విషయంలో ఏ మాత్రం వేలు పెట్టడం లేదు ..ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అసలు అల్లు అర్జున్ ఇష్యూ పై ఎక్కడ కూడా ఆయన నోరు మెదపడం లేదు. ట్వీట్ కూడా చేయడం లేదు. దీంతో ఇండస్ట్రీలో అసలు మహేష్ బాబు ఏ పక్షాన ఉన్నాడు..? టాలీవుడ్ వైపు ఉన్నాడా..? లేక రేవంత్ రెడ్డి వైపు ఉన్నాడా..? సినీ సభ్యులు రేవంత్ రెడ్డితో మీటింగ్లో మహేష్ బాబును కూడా ఆడ్ చేయాలని చూశారు . కానీ మహేష్ బాబు కొన్నిసాకులు చెప్పి తప్పించేసుకున్నాడట . ఈ వార్త కూడా సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . అయితే ఇప్పుడు ఇదే మూమెంట్లో మహేష్ బాబుకు సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.
మహేష్ బాబు ముందు నుంచి చాలా తెలివైనవాడు అని .. ఎవరితోనూ వైర్యం పెట్టుకోడు అని.. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంటుతో మంచి గానే ఉంటాడు అని .. గతంలో కేటీఆర్ తో ఎంత క్లోజ్ గా ఉన్నాడో అందరికీ తెలిసిన విషయమే అని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు మహేష్ బాబుకు రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అట . గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వాళ్ళ బాబాయ్ చెప్పుకొచ్చారు . సూపర్ స్టార్ కృష్ణ కి కాంగ్రెస్ పార్టీ అన్న స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్న చాలా చాలా ఇష్టం అభిమానం .
అయితే మహేష్ బాబుకి కూడా అలాగే రాజకీయాలపై మంచి పట్టు ఉంది అని .. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ముందే గెలుస్తాడు అని అంచనా వేసిన మహేష్ బాబు.. ఆయన గవర్నమెంట్ కి సపోర్ట్ చేసేలా ముందు నుంచే పక్కా ప్లాన్ లో ఉన్నాడు అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో మహేష్ బాబు స్పందించకపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డినే అంటున్నారు జనాలు. రేవంత్ రెడ్డి చాలా మొండివాడు అన్న విషయం మహేష్ బాబుకు బాగా తెలుసు అని ..ఆ కారణంగానే ఆయనకు నచ్చని పనులు కోపం తెప్పించే పనుల్లో అస్సలు వేలు పెట్టకూడదు అంటూ డిసైడ్ అయ్యారట. దీంతో మహేశ్ బాబు తెలివికి ఫిదా అయిపోతున్నారు జనాలు..!