ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన వల్ల పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన లో అల్లు అర్జున్ ఎ 11 గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.పోలీసులు పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనని సీరియస్ గా తీసుకోవడంతో ఎంత పెద్ద రచ్చ అయిందో చూశాం.అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యాక సినీ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది. అల్లు అర్జున్ ని సినీ ప్రముఖులంతా పరామర్శించారు. అప్పడు పరామర్శించిన వారే ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా అల్లు అర్జున్ ని కలసి పరామర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ తర్వాత సీన్ రివర్స్ అయింది.అల్లు అర్జున్ ని పరోక్షంగా ఏకిపారేస్తూ సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాత్రమే కాదు తమ్మారెడ్డి కూడా అల్లు అర్జున్ దే తప్పు అన్నట్లు గా వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సీఎం దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ నీవు పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోవాలి. ఒక్కరు కాదు అందరూ ఈ విషయం లో అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలి అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి అని సురేష్ బాబు అన్నారు.నీ ఇంట్లో నువ్వు ఎగురు, డ్యాన్స్ చెయ్ ఎమన్నా చేసుకో.. కానీ బయటకి వచ్చినపుడు పద్దతిగా ఉండాలి కదా అంటూ సురేష్ బాబు మండిపడ్డారు.ఈ క్రమంలో సురేష్ బాబు, జనాలందరి గురించి చెప్పినప్పటికీ, పరోక్షంగా అల్లు అర్జున్ ప్రవర్తన సరిగ్గా లేదని, అల్లు అరవింద్.. పబ్లిక్‌లోకి వస్తే ఎలా ఉండాలో కొడుక్కి నేర్పించలేదని ఆయన వ్యాఖ్యానించాడంటూ పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు.ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: