అయితే రీసెంట్గా జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి సినిమా వాళ్లకు కొన్ని కండిషన్స్ పెట్టారట. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది . ఇకపై సినిమా రిలీజ్ అయ్యే మూమెంట్లో ప్రతి స్టార్ కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక వీడియో కచ్చితంగా చేయాలట . సినిమా టైటిల్స్ లో కూడా డ్రగ్స్ , గంజాయి వంటి పదాలకు చోటు ఇవ్వకూడదట. ఒకవేళ ఏ హీరో అయినా ఏ సినిమేకర్స్ అయినా సరే హద్దులు మీరుతూ డ్రగ్స్ ని గంజాయిని ప్రమోట్ చేసే విధంగా సినిమాలో చూపిస్తే మాత్రం లీగల్ యాక్షన్స్ కచ్చితంగా తీసుకుంటాము అంటూ తేల్చి చెప్పేసారట.
సినిమాల ప్రభావం యువతపై చాలా ఉంటుంది అని ఆ కారణంగానే సినిమాలలో చూపించే సీన్స్ జనాలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది అంటూ కూడా మాట్లాడారట . దీంతో ఇకపై సినిమాలో ఏ విధమైనటువంటి డ్రగ్స్ కి గంజాయి కి సంబంధించిన సీన్స్ చిత్రీకరించకూడదు అంటూ సినిమా మండలి డిసైడ్ అయిందట. అంతేకాదు కొన్ని కొన్ని విషయాలల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన సజెషన్స్ ని తూ ఛా తప్పకుండా పాటించాలి అంటూ డిసైడ్ అయ్యారట సినీ సభ్యులు..!