రీసెంట్గా రేవంత్ రెడ్డి తో టాలీవుడ్ సినీ సభ్యులు మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అయితే ఈ మీటింగ్ తర్వాత అందరూ అల్లు అర్జున్ ని నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు తప్పిస్తే అల్లు అర్జున్ కి సపోర్ట్ చేసే విధంగా ఎవరు స్పందించట్లేదు . అంతేకాదు అల్లు అర్జున్ చేసింది తప్పే అంటూ పలువురు బన్నీ ఫాన్స్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు . మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోకుండా పెద్ద రాద్ధాంతం చేసే విధంగా చేసుకున్నాడు అని.. పుష్ప2 ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ హీరోస్ పేర్లు ప్రస్తావించకపోవడం.. తాను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మెగా ఫ్యామిలీ అని చెక్క చెప్పకపోవడం బాగా మైనస్ గా మారింది అంటున్నారు .
అంతేకాదు అసలు పవన్ కళ్యాణ్ కి యాంటీగా ఉన్న వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేయకుండా ఉంటే అల్లు అర్జున్ కెరీర్ ఇలా ఉండేదే కాదు అని కూడా మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ ఈగో .. హెడ్వైట్ కారణంగానే ఇలా జరిగింది అని ఏదో ఇష్యూ జరిగాక వెళ్లి పవన్ కళ్యాణ్ కి చిరంజీవి కి సారీ చెప్పి ఉంటే ఇంత పెద్ద సీన్ క్రియేట్ అయి ఉండేది కాదు అని .. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అదే విధంగా పవన్ కళ్యాణ్ .. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ మ్యాటర్లో అస్సలు వేలు పెట్టకపోవడం .. ఆయన పుష్ప2 సినిమా విషయాన్నీ కూడా ఎక్కడ ప్రస్తావించకపోవడం అల్లు అర్జున్ కి బాగా నెగిటివ్ గా మారిపోయింది అని.. అల్లు అర్జున్ ఈగో ఇంతటికి దారితీసింది అంటూ మాట్లాడుకుంటున్నారు . ఇకనైనా అల్లు అర్జున్ కొంచెం తగ్గి మెగా ఫ్యామిలీ హీరోలతో కలిస్తే బాగుంటుంది అని.. లేకపోతే మెగా హీరోలకి వచ్చిన నష్టం ఏమీ లేదు .. టోటల్ అల్లుఅర్జున్ కెరియర్ కొలప్స్ అవుతుంది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . కొందరు అల్లు అర్జున్ ది హెడ్ వెయిట్ అంటుంటే మరి కొందరు అల్లు అర్జున్ ది ఈగో ..మూర్ఖత్వం అంటూ కూడా ఆయనను నిందిస్తున్నారు..!