టాలీవుడ్ పెద్దలందరూ దిల్ రాజు సమక్షంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సమావేశం అయ్యారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. గురువారం రోజున జరిగిన ఈ భేటీలో దాదాపు 40 మంది హాజరయ్యారు. ఇందులో సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం, శివ బాలాజీ వంటి హీరోలు కూడా ఉన్నారు. కానీ ఈ సమావేశానికి వచ్చిన టాలీవుడ్ ప్రతినిధుల్లో ఒక్క మహిళ కూడా కనిపించలేదు. అయితే రేవంత్ రెడ్డితో మీటింగ్ కి మంచు విష్ణు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి.


ఒకవేళ అతను సినిమా పనుల్లో బిజీగా ఉన్నారా? లేదా ప్రస్తుతం ఇండియాలో ఉన్నారా? లేదా? ఉండి కూడా మీటింగ్ కి రాలేకపోయారా అనే చర్చలు మొదలవుతున్నాయి. అయితే తాను రాలేకపోతున్నందు వల్లే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున నటుడు శివ బాలాజీని పంపించి ఉంటాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. శివ బాలాజీ ప్రజెంట్ 'మా' ట్రెజరర్ గా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు.


కాబట్టి విష్ణు రాలేని కారణంగానే అసోసియేషన్ తరపున నుంచి అతడిని పంపించి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.... ఇదే విషయాన్ని తాజాగా నటి పూనమ్ కౌర్ ప్రశ్నించారు. ఇండస్ట్రీ పెద్దల్ని, సీఎంని తన పోస్టులతో నిలదీస్తోంది. పూనమ్ కౌర్ వేసే పోస్టుల మీద పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది.


కాగా పూనమ్ ప్రశ్నిస్తూ.... సీఎంతో జరిగిన సమావేశంలో ఒక్క మహిళా ప్రతినిధిని కూడా పెట్టాలని ఎవ్వరూ కూడా అనుకోలేదు. అంటే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవా? ఓ హీరోకి సమస్య వచ్చినా ట్రేడ్ మ్యాటర్ల ఇష్యూ వచ్చినా ఇలా అందరూ ఏకం అవుతారు. కానీ అదే ఓ మహిళకు సమస్య వస్తే ఎవరూ కూడా ముందుకు రారు అంటూ నటి పూనమ్ కౌర్ ప్రశ్నించారు. పూనమ్ కౌర్ చేసిన ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: