ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ ఎంత హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది అందరికీ తెలిసిందే . ఇంట్లోని ఆడవాళ్లు .. పనిచేసే పని వాళ్లు.. సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ .. రాజకీయ నాయకులు సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఒకరా ఇద్దరా..  అసలు దేశంలో మరి ఏ సమస్య లేనట్టు అందరూ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్  తొక్కిసలాట ఘటనలో ఎవరు నిందితులు..? అల్లు అర్జున్కి సరైన టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వని యాజమాన్యందా..? లేక పోలీసులు అల్లు అర్జున్ విషయంలో అబద్ధం చెపుతున్నారా..? కావాలని రేవంత్ రెడ్డి - అల్లు అర్జున్ తన పేరు చెప్ప కుండా మర్చిపోయాడు అనే కారణంగా ఇలా మాట్లాడుతున్నారా..? రకరకాలుగా స్పందిస్తున్నారు.


మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కేసు విషయంలో టాలీవుడ్ కూడా ఆయనకు నెగిటివ్గా మాట్లాడుతుండడం అందరికీ షాకింగ్ గా ఉంది . అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదలి వచ్చి అల్లు అర్జున్ ని పరామర్శించింది అని అయితే అల్లు అర్జున్ పై టాలీవుడ్ ఇప్పుడు నెగిటివ్గా స్పందించడానికి కారణం రేవంత్ రెడ్డినే అంటున్నారు జనాలు . రేవంత్ రెడ్డితో మీటింగ్ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల పరోక్షకంగా బన్నీపై మండిపడుతున్నారు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు అసలు అల్లు అర్జున్ టోటల్ ఇష్యూ మొత్తంలో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి క్యారెక్టర్ బిస్కెట్ అయింది అని .. ఆయన అసలు అల్లు అర్జున్ కి ఏ విధంగా సహాయ పడలేకపోయాడు అని పొలిటికల్ పరంగా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడేలా చేయలేకపోతున్నాడు అని.. కాస్తో కూస్తో  మెగాస్టార్ చిరంజీవిని కలగజేసుకొని బెయిల్ వచ్చేలా హెల్ప్ చేశాడు అని ..



కానీ ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ కి ఏ విధంగా ఉపయోగపడలేకపోతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. అక్కడికి అయిన వెళ్తున్నప్పుడు  ఆ వీడియోలో ఆయన కనిపించడం తప్పిస్తే ఎక్కడ కూడా అల్లు అర్జున్ కి ఆయన సహాయం చేయలేకపోతున్నాడు అంటూ దారుణంగా బన్నీ ఫాన్స్ మాట్లాడుతున్నారు . అంతేకాదు అసలు స్నేహ రెడ్డి చెప్పిన కారణంగానే నంద్యాల ప్రచారంకి అల్లు అర్జున్ వెళ్ళాడు అని ..అసలు ఆ రోజే అలా వెళ్లకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఇంత తలనొప్పుల క్రియేట్ అయ్యి ఉండేటివే కాదు అంటూ పరోక్షకంగా స్నేహారెడ్డి పై కూడా ఫైర్ అవుతున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ అల్లు ఫ్యామిలీకి నెగిటివ్ గానే అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: