సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చెప్పిన మాట వినరు అని .. వాళ్ళు చెప్పిందే వినాలి అని.. వాళ్ళు చెప్పిన విషయాన్ని ఫైనలైజ్ చేయాలి అని ..మొండి పట్టుదలగా ఉంటారు అని ఎప్పటినుంచో కామెంట్స్ వినిపించేవి. అల్లు అర్జున్ విషయంలో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ అలానే ఉంది అంటూ మాట్లాడుకున్నారు జనాలు . అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్న రేంజ్ లో ఆయన తీసుకున్న డెసిషన్ కి కమిట్ అయి ఉన్నాడు . మొదటి నుంచి  జనాల ప్రాణాలు ఇంపార్టెంట్ అంటూ భావించే రేవంత్ రెడ్డి తెలంగాణలో బెనిఫిట్ షో లకి పర్మిషన్ ఇవ్వమని టికెట్ రేటు పెంచము అని సామాన్య జనాలకు అండగానే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అంటూ తేల్చి చెప్పేసాడు.


దీనికోసం 36 మంది సభ్యులతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రేవంత్ రెడ్డితో మీటింగ్లో కూడా పాల్గొన్నారు. బడాబడా ప్రముఖులు కూడా ఉన్నారు . రేవంత్ రెడ్డి కన్నా వయసులో పెద్దవారు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు . మీటింగ్ తరువాత సినీ సభ్యులు ఎవ్వరు కూడా అల్లు అర్జున్ ఇష్యూ పై పాజిటివ్గా స్పందించట్లేదు . మరి ముఖ్యంగా సురేష్ బాబు అయితే ఒకానొక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ కూడా చేశారు.



"పిల్లల పెంపకం బాగుండాలి అని ..ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తిరిగిన పర్వాలేదు ..ఎలా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. బయటకు వెళ్ళినప్పుడు చక్కగా ఉండాలి అని.. పద్ధతులు నేర్పించాలి అని కాలేజీలో కూడా ఇలాంటివి చెప్తే బాగుంటుంది" అంటూ పరోక్షకంగా అల్లు అర్జున్ బిహేవియర్ పై సంచలన కామెంట్స్ చేశారు. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మండిపోతుంది . అయితే చాలామంది మాత్రం రేవంత్ రెడ్డి నే పొగిడేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్ సినీ సభ్యులకి బాగా ఎక్కేసింది అని .. ఆ కారణంగానే నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ భజన చేసిన వీళ్లంతా ఇప్పుడు అల్లు అర్జున్ కి యాంటీగా మారిపోయారు అని .. ఇక పై అల్లు అర్జున్ విష్యంలో  స్పందించకపోవడం బెటర్ అంటూ చేతులెత్తేసారు అని మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: