స్టార్ హీరో అల్లు అర్జున్ వివాదంలో ఇప్పటికే ఊహించని స్థాయిలో ట్విస్టులు చోటు చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. బన్నీ విషయంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు చేసిన రచ్చ అంతాఇంతా కాదు. బన్నీది ఏపీ అని అక్కడికే వెళ్లిపోవాలని కొందరు నేతలు చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. అయితే సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దల మీటింగ్ అనంతరం పరిస్థితులు మారాయి.
 
కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం బన్నీ విషయంలో, ఇండస్ట్రీ విషయంలో కూల్ గా ఉన్నారు. అయితే ప్రముఖ రాజకీయ పార్టీలలో ఒకటైన బీజేపీ మాత్రం ఈ విషయాన్ని సాగదీస్తోంది. కొందరు బీజేపీ నేతలు ఈ వివాదం విషయంలో బన్నీదే తప్పనే అర్థం వచ్చే విధంగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం విషయంలో అల్లు అర్జున్ కు బీజేపీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.
 
అల్లు అర్జున్ వివాదం విషయంలో బీజేపీ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా కామెంట్లు చేస్తుండటం కొసమెరుపు. అల్లు అర్జున్ మాత్రం ఒకింత సైలెంట్ గా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ వల్ల తెలంగాణ సర్కార్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కోట్ల రూపాయల లాభం కలుగుతోంది. బన్నీ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. బన్నీ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రభాస్, బన్నీ ఒక సినిమాన్ మించి మరో సినిమాకు ఎదుగుతూ ప్రశంసలు పొందడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.  ఐకాన్ స్టార్ బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: