బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది నక్సస్ లేక వెనక పడుతున్నారు. అతి తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అందాల భామ కృతి సనన్ ఒకరు. కృతి తన నటనతో అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా వన్ నేనొక్కడినే సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగు సినీ అభిమానులు కృతిని పెద్దగా ఆదరించలేకపోయారు.


ప్రభాస్‌ తో కూడా  కృతి సనన్ సినిమా చేసింది. అటు కృతి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళిపోయింది. అక్కడ వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ అగ్ర హీరోయిన్ గా చలామణి అవుతోంది. కృతి తన కెరీర్ ప్రారంభించిన మొదటి నుంచి సినిమాలలో మాత్రమే కాకుండా యాడ్స్ ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తోంది. అంతేకాదు కృతి సనన్ బిజినెస్ లో కూడా నిర్వహిస్తుండడం గమనార్హం. గత కొద్ది రోజుల నుంచి కృతి సనన్ ఓ వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తుందంటూ అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. 


అంతేకాకుండా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇక ఆ వ్యక్తి మరెవరో కాదు మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని, అతని భార్య సాక్షికి సన్నిహితుడు అయినటువంటి ప్రముఖ బిజినెస్ మెన్ కబీర్ బహియా. ఇతడితో చాలా కాలం నుంచి కృతి డేటింగ్ చేస్తుందని వార్తలు హల్చల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్య 9 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. 

కృతి సనన్ 9 సంవత్సరాలు కబీర్ కన్నా పెద్దది. అయినప్పటికీ వీరిద్దరూ రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఇక రీసెంట్ గా క్రిస్మస్ సందర్భంగా కృతి సనన్ కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలలో కబీర్ తో కలిసి ఫోటోలు దిగింది. ఇక అతనితో ఉన్న రిలేషన్ ను కృతి సనన్ డైరెక్ట్ గా అందరితో షేర్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: