స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పై అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడమే కాకుండా కోర్టులో హాజరు పరిచారు.. దీంతో నాంపల్లి కోర్టు ఏకంగా 14 రోజులపాటు రిమాండ్ విధించడం అయితే అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు సైతం మద్యంతర బెయిల్ ను రిలీజ్ చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ కు ఇచ్చిన 14 రోజుల జ్యుడీషియల్ బెయిల్  ఈరోజుతో ముగియనుండగా.. అల్లు అర్జున్ వర్చువల్ కోర్టుకు సైతం హాజరు అయ్యారట.. నిజానికి అల్లు అర్జున్ డైరెక్టర్ గా కోర్టుకి హాజరు కావాల్సి ఉన్నది..


అయితే కొన్ని కారణాలు చేత తాను డైరెక్ట్ గా కోర్టుకు రాలేనని ఆన్లైన్ ద్వారా హాజరవుతానంతో న్యాయవాదుల ద్వారా కోర్టుకి సందేశం పంపి కోరగా అందుకున్న న్యాయమూర్తి కూడా అంగీకరించడంతో అల్లు అర్జున్ వర్చువల్గా హాజరైనట్లు తెలుస్తోంది. మధ్యంతర బెయిల్ విషయాన్ని నాంపల్లి కోర్టుకి న్యాయవాదులు తెలియజేయడంతో ఈ సమయంలోనే రెగ్యులర్ మెయిల్ కోసం వేసినటువంటి ఈ పిటిషన్ దాఖలు చేయగా వీటిపైన విచారణకు సైతం సోమవారానికి వాయిదా వేయబోతున్నట్లు తెలియజేశారు.



మరొకసారి అల్లు అర్జున్ సోమవారం రోజున కోర్టుకి రావాల్సి ఉంటుందేమో చూడాలి మరి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ పైన కక్ష కట్టిందనే విషయంపై పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి.. నిన్నటి రోజున సినీ పెద్దలు సైతం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడంతో పాటుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి డెవలప్మెంట్ విషయం పైన కూడా చర్చించారు. దీంతో మీరు చెప్పిన అన్ని విషయాలకు ఓకే చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు టికెట్ల పెంపుకు మాత్రం తాను హామీ ఇవ్వనంటు ఖరాకండిగా చెప్పేయడం జరిగింది. దీంతో సినీ పెద్దలు కూడా కాస్త నిరాశలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: