సినీ ప్రముఖులందరూ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఘటన ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం గా మారింది.తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు తో కలిసి నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్ హీరోలతో పాటు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రాఘవేంద్ర రావు వంటి వారు ఈ సమావేశం లో పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్నప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనకీ బదులుగా సెక్రటరీ శివ బాలాజీ ఈ సమావేశం లో పాల్గొన్నాడు. అయితే ఇండస్ట్రీ కి ఏ చిన్న సమస్య వచ్చినా, ఇండస్ట్రీ కి పెద్దన్న పాత్ర పోషిస్తూ మెగాస్టార్ చిరంజీవి పరిష్కరించేవాడు. ఈ సమావేశానికి కూడా ఆయన వచ్చి సీఎం తో మాట్లాడుతాడని అనుకున్నారు కానీ, ఆయన ఈ సమావేశం లో పాల్గొనకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.అయితే ఆయన వెళ్ళకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి చిరంజీవికి ఒక అవగాహన ఉంది. ఆయన కచ్చితంగా బెనిఫిట్ షో ల విషయంలో వెనక్కు తగ్గే ఛాన్స్ లేదనేది క్లియర్ కట్ గా చిరంజీవికి అర్థమైంది. అసెంబ్లీలో మాట్లాడిన మాటపై తగ్గరు అనే అవగాహన ఉంది. అలాగే అక్కడికి వెళితే అల్లు అర్జున్ వ్యవహారాన్ని కచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తారు అనేది చిరంజీవి ముందుగానే అంచనా వేసుకున్నారు. చిరంజీవి అంచనాకు తగ్గట్టుగానే వీడియోతో సహా అల్లు అర్జున్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళందరికీ ప్రత్యక్షంగా చూపించారు.ఇక ఇవన్నీ తెలిసిన చిరంజీవి అనవసరంగా వెళ్లి ఉన్న పరువు పోగొట్టుకోవడం ఎందుకని సైలెంట్ అయిపోయారు. ఈరోజు ఉదయం వరకు చిరంజీవి వెళతారని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం వెళ్లేందుకు ఇష్టపడలేదు. గతంలో వైయస్ జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏదో ఒక రకంగా జగన్ ను శాంతింప చేసిన చిరంజీవి,రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. అల్లు అర్జున్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి నోటి నుంచి ఒక్క మాట కూడా మద్దతుగా కాని వ్యతిరేకంగా గాని రాలేదు.

ఇదిలావుండగా తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఎన్ని విధాలుగా చెప్పినా రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో తాను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని క్లారిటీ ఇచ్చారు. తనను బతిమిలాడే అవకాశం కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. అయితే కొంతమంది మాత్రం చిరంజీవి వెళితే రేవంత్ రెడ్డి కరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇక అక్కడికి వెళ్లి విజ్ఞప్తులు,క్షమాపణలు, దండాలు,నమస్కారాలు కుశల ప్రశ్నలు, ఆర్టిఫిషియల్ నవ్వులు ఎందుకని భావించిన చిరంజీవి మీరు వెళ్లి రండి అంటూ తన తరఫునుంచి సాయిధరమ్ తేజ్ ను పంపించారు. సాయి ధరమ్ తేజ్ కూడా అక్కడ ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళేం మాట్లాడుతున్నారో విని బయటకు వచ్చేసాడు.చూడాలి మరి ఈ కీలక చర్చల పరిణామం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: