అయితే ఇప్పుడు తాజాగా క్రిస్మస్ కానుక ఆమెకు ఎంతో ఇష్టమైన ప్యారిస్లో వైన్ యార్డును గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా సుకేష్ తెలిపారు.అందుకు సంబంధించి ఆమెకు క్రిస్మస్ సందేశం కూడా పంపించినట్లు సమాచారం. జాక్వెలిన్ ఫెర్మెండెజ్ ను బేబీ గర్ల్, మై లవ్ అంటూ కూడా సుఖేష్ చంద్రశేఖర్ సంబోధించడం జరిగింది.. మనకి ఈ పండుగ చాలా ఇష్టమైనది.. కాకపోతే మనిద్దరం కలిసి జరుపుకోలేకపోతున్నాము.. కానీ మన మనసులు చేరువయ్యాయి నీ చేతులు పట్టుకొని అందమైన నీ కళ్ళల్లోకి చూస్తూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలని ఉంది అంటూ తెలిపారు.
ఈ ఏడాది నీకు చాలా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకున్నాను.. ఈరోజు ఈ వైన్ బాటిల్ గిఫ్ట్ గా ఇవ్వలేదు.. నువ్వు ఎప్పుడూ కలలుకనే కంట్రీ ఆఫ్ లవ్ గా ప్యారిస్ వైన్ మార్డ్ నే కానుకగా ఇస్తున్నానని వెళ్లడించారు. ఈ ప్యారిస్ తోటలో ని చెయ్యి పట్టుకొని నలవాలని ఉంది.. నేను నీ మాయలో పడి పిచ్చోడనీ ఈ ప్రపంచం అనుకోవచ్చు.. నీ ప్రేమ ముందు నేను పిచ్చోడినే అంటూ తెలిపారు. ప్రస్తుతం సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ జైల్లో ఉన్నారు. జాక్వెలిన్ ఫెర్మెండెజ్ కు సుఖేశ్ చంద్రశేఖర్ కు క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అప్పటినుంచి ఈమె పేరు వైరల్ గా మారుతోంది.