చాలా రోజుల నుండి కోలీవుడ్ మీడియా మొత్తం ఒక్కటే మాట్లాడుకుంటుంది. అదేంటంటే..విజయ్ త్రిషల మధ్య ఉన్న ఎఫైర్.. వీరి మధ్య ఎన్ని ఎఫైర్ వార్తలు వచ్చినా కూడా మాకు ఏం పట్టదు అన్నట్లు చెట్టాటపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇక ఇన్ని డేటింగ్ రూమర్స్ మధ్య కూడా రీసెంట్ గా కీర్తి సురేష్ పెళ్లికి విజయ్ త్రిషలు కలిసి వెళ్లారంటే వీరి మధ్య బాండింగ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే త్రిష విజయ్ ల మధ్య ఉన్న బంధం నిజమేనని, అందుకే విజయ్ కి భార్య సంగీత దూరంగా ఉంటుంది అంటూ సంచలన కామెంట్లు చేశారు ప్రముఖ జర్నలిస్టు సెగురా.. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రిష విజయ్ ల మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టడమే మా పని. చాలా రోజుల నుండి త్రిష విజయ్ మధ్య ఈ వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ వాళ్లు వాటిని ఖండించడం లేదు ఒప్పుకోవడం లేదు.ఇక మాస్టర్ సినిమా సమయంలో వీరిద్దరూ ఒకటిగా కలిసి వచ్చారు. ఆ తర్వాత లియో సినిమాకి కూడా విజయ్ తో నటించడానికి త్రిష ఒప్పుకుంది. ఇక లియో సినిమాలో ఉండే ఒక ముద్దు సన్నివేశం వీరిద్దరి మధ్య మరింత అనుబంధాన్ని పెంచింది. చాలామంది హీరోయిన్ల విషయంలో ఇలాంటి ఎఫైర్ వార్తలు వినిపిస్తే వాటిని ఖండిస్తారు లేదా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. కానీ త్రిష ఇప్పటివరకు ఆ వార్తలు ఖండించడం లేదు అలాగే వేరే వ్యక్తి ని పెళ్లి కూడా చేసుకోవడం లేదు.ఇక విజయ్ 50వ పుట్టినరోజు నాడు ఐ లవ్ ఫరెవర్ అంటూ పోస్ట్ పెట్టింది.ఈ పోస్టు మరిన్ని వివాదాలకు దారితీసింది.

అలాగే  ఈ విషయం అంతా గమనిస్తున్న సంగీత భర్తకు దూరంగా ఉంది. ఎందుకంటే ఏ భార్య అయినా సరే తన భర్త వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉండి సన్నిహితంగా మాట్లాడితే అస్సలు సహించదు. అందుకే సంగీత కూడా దూరంగా ఉంటుంది. త్రిష ఇప్పటికే ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.కానీ విజయ్ తో మాత్రమే ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో బంధం ఉంటేనే కదా ఆ వార్తలు వినిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగరాదు కదా అంటూ జర్నలిస్టు సెగురా సంచలన్ కామెంట్లు చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: