తెలుగులో తండెల్, హిందీలో రామాయణం సినిమాలతో ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు .. అందుకే కాస్త సమయం దొరికినప్పుడల్లా రిలాక్స్ కోసం తన చెల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు సాయి పల్లవి .. ఇక్కడ బీచ్లో సేద తీరుతూ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.. మరో సీనియర్ భామత్రిష కూడా మామూలుగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది .. ముందుగా తెలుగులో చిరంజీవితో విశ్వంభర తో పాటు .. కోలీవుడ్లో అజిత్ , విజయ్ , సూర్య వంటి అగ్ర హీరోలతో వరుస సినిమాలో నటిస్తున్నారు .. ఇలా ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ సీనియర్ బ్యూటీ కాస్త సమయం దొరికితే చాలు పటాయ బీచ్ కు వెళ్ళిపోతున్నారు ..
థాయిలాండ్ లో త్రిష ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2024 లో కాస్త జోరు తగ్గించిన శ్రీ లీల.. 2025లో మాత్రం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు .. వచ్చే కొత్త సంవత్సరంలో ఐదు సినిమాలతో ఈ బ్యూటీ రెడీగా ఉంది .. ఈ లోపే తన వెకేషన్ లకు ప్లాన్ చేస్తున్నారు. మరో హీరోయిన్ కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ రిలీజ్ తర్వాత వెకేషన్ కు వెళ్ళిపోయారు .. ఇలా టాలీవుడ్ అగ్ర హీరోయిన్లు అందరూ ఒకపక్క సినిమాలు చేస్తూనే .. మరోపక్క పర్సనల్ స్పేస్ తీసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.