గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – యూనివర్సల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఏకంగా డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. అయితే విడుదల దగ్గర పడుతున్న సందర్భంలో ఈ సినిమాకు తెలంగాణలో ఊహించని షాక్ తగిలింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇకపై తెలంగాణలో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి లేదని, సినిమా టిక్కెట్లు కూడా పెంచుకునేందుకు అనుమతి ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. దీనితో 'గేమ్ ఛేంజర్' కలక్షన్‌పై ఈ గట్టిగా ప్రభావం పడుతోంది.ఈ నేపథ్యంలోనే ఏపీ లో కూడా ఈ మూవీ కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం వుంది. అదెలా అనగా గతంలో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుండి మొదలై 19 వ తేదీ వరకు కొనసాగేది. కానీ ఈసారి మాత్రం సెలవులు కుదించే ఆలోచనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

జనవరి 11న పండగ సెలవులు మంజూరి చేసి, 15 కి ముగించాలని, లేదా 12 న ప్రారంభించి 16 కి ముగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే సెలవు దినాలు తక్కువ అవ్వడం వల్ల, గేమ్ చేంజర్ చిత్రానికి కనీసం పది నుండి 20 కోట్ల రూపాయిల వసూళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ప్రభుత్వం అధికారికంగా ఇంకా తీసుకోలేదు కానీ, తీసుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయని మాత్రం ప్రచారం జరుగుతుంది. ఒకపక్క తెలంగాణ లో టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ లేక, మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ లో పండుగ సెలవులు తక్కువ అవ్వడం వంటివి చూస్తుంటే ‘గేమ్ చేంజర్’ పై చాలా గట్టి ప్రభావం పడేలాగానే అనిపిస్తుంది.ఇదిలావుండగా సోలో హీరో గా రాంచరణ్ ఇన్నేళ్ల తర్వాత చేస్తున్న సినిమా  ‘గేమ్ చేంజర్’. శంకర్ నుండి ఈసారి మినిమం గ్యారంటీ రేంజ్ సినిమా వస్తుందని బలమైన సంకేతాలు ఇచ్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకి ‘పుష్ప 2’, ‘దేవర’ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయా రావా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: