ఇక పాన్ ఇండియా సినిమాలకు ఈ రోజుల్లో ప్రమోషన్ ఎలా చేస్తున్నారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. కానీ ఓ రీజనల్ సినిమాలకు కూడా అదే స్థాయిలో ప్రమోషన్లు మొదలుపెట్టారు మేకర్స్. మరి ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలో ఈ పోటీ గట్టిగా కనిపిస్తుంది. వచ్చే సంక్రాంతికి గేమ్ చేంజర్ కు పోటీగా వస్తున్న రెండు సినిమాలు కూడా ఇవే దూకుడు చూపిస్తున్నాయి.ఇక వచ్చే సంక్రాంతికి కూడా ఎప్పటిలాగే భారీ సినిమా పోటీ ఉంది .. అందరికంటే ముందుగా గేమ్ చేంజర్ అంటూ రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు .. ఆ తర్వాత డాకు మహారాజ్‌ అంటూ బాలయ్య యుద్ధానికి సై అంటున్నాడు ..


వీరితోపాటు నేనున్నాను అంటూ సంక్రాంతికి వస్తున్నారు వెంకటేష్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నామనం సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి పండగ మామూలుగా కనిపించడం లేదు గట్టిగానే ప్లాన్ చేశారు .. ప్రమోషన్ల విషయంలో కూడా ఎవరు ఎక్కడ తగ్గేదెలే అంటున్నారు. ఈ ముగ్గురిలో ప్రమోషన్స్ పరవాన్ని ఎవరు ఎలా మొదలు పెడుతున్నారు ? ఎక్కడ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అనేది ఇక్కడ చూద్దాం.ఇక సంక్రాంతి సినిమాలు విషయానికి వస్తే ప్రమోషన్లు పరంగా అందరూ ఎవరి స్థాయిలో వారు దూసుకుపోతున్నారు . ప్రధానంగా గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా సినిమా కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రమోషన్లు చేస్తున్నారు మేకర్స్.


డిసెంబర్ 21న అమెరికాలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇక గేమ్ ఛేంజర్‌కు పోటీగా బాలకృష్ణ , వెంకటేష్ కూడా తమ దూకుడు చూపిస్తున్నారు .. ఇక వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం విషయంలో అనిల్ రావిపూడి ఎక్కడ అసలు తగ్గట్లేదు. రమణ గోగులతో పాడించిన ఫస్ట్ సాంగ్ టాలీవుడ్ ను షేక్ చేసింది. రీసెంట్ గా వచ్చిన రెండో పాట కూడా మెప్పించింది. ఇప్పుడు తాజాగా మూడో పాట అప్డేట్ కూడా వచ్చేసింది. ఇక బాలకృష్ణ డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అమెరికాలోనే ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. మొత్తానికి పండగ సినిమాలు ఒకరితో ఒకరు పోటీ గట్టిగానే కనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: