జాన్వీ కపూర్‌ బాలీవుడ్ మీద ఫోకస్ తగ్గించిందా ? లేకుంటే పూర్తిగా సినిమాలే తగ్గించేస్తుందా ? ఇప్పుడు ఈ విషయం మీదే గట్టి డిబేట్ జరుగుతుంది బాలీవుడ్ సర్కిల్స్ లో .. దేవర సక్సెస్ తర్వాత జాన్వీ వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది .. సౌత్ సినిమాలతోనే వరల్డ్ ఫేమస్ కావాలని ఫిక్సయిందా ? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం .. తంగం క్యారెక్టర్ తో సౌత్ జనాలకు గట్టిగానే గిలిగింతలు పెట్టింది అతిలోక‌ సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌. ఈ సినిమా పాన్ ఇండియా లవల్‌ లో 500 కోట్ల మార్కు కలెక్షన్ దాటడంతో పాటు జాన్వీ లోని గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ యాంగిల్స్ ని సాత్ ప్రేక్షకులకి స్పెషల్గా పరిచయం చేసినట్టయింది.


ఇక దేవర తర్వాత నార్త్ అండ్ సౌత్ లో కొంత సైలెంట్ మైంటైన్ చేస్తుంది జాన్వీ .. ఇక తాజాగా ఆమె నటిస్తున్న పరమ సుందరి గ్లిమ్స్ రిలీజ్ అయింది .. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన పరమ సుందరి వచ్చే 2025 జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అచ్చ‌ తెలుగు అమ్మాయిలాగా చీర కట్టుకుని కనిపించింది జాన్వీ. ఇక పరమ సుందరి కాకుండా నార్త్‌లో ఒకే ఒక సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ..సన్నీ సంస్కారి కి తులసి కుమారి అనేది ఈ ప్రాజెక్ట్ పేరు .. తర్వాత ఏం చేయబోతున్నారంటే ప్రస్తుతానికి ఏం అప్డేట్స్ లేదు ..


కానీ తెలుగులో ఇప్పటికే రామ్ చరణ్ తో కలిసి నటిస్తుంది జాన్వీ కపూర్ . బుచ్చిబాబు సానా సినిమా తర్వాత తెలుగులో మహేష్ బాబు , రాజమౌళి సినిమాకి కూడా జాన్వీ ఓకే చెప్పారనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. రాజమౌళి క్లారిటీ ఇస్తే గాని దాని గురించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎలాగూ దేవర 2లో మాత్రం ఈమె హల్చల్ చేయటం పక్క .. అప్పటి దాకా రామ్ చరణ్ సినిమా కోసం అభిమానులు ఎదురు చూడాల్సిందే. ఇక మరి సౌత్ సినిమాలతో జాన్వీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: