అయితే వరుస విజయాలు అందుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా వడ్డే నవీన్ ఫ్లాపులు సైతం చుట్టూ ముట్టాయి. ఆ తర్వాత సినిమాల కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక నెమ్మదిగా క్రేజ్ తగ్గిపోయింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన వడ్డే నవీన్ చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించని ఈ హీరో తాజాగా ఇటీవల మీడియా ముందుకు రావడం జరిగింది.
తాజాగా జరిగిన కొత్తపల్లి గీత, రామకోటేశ్వర దంపతుల కుమారుడు అభినవ్ తేజ్ వివాహానికి సైతం వడ్డే నవీన్ హాజరు కావడం జరిగిందట. అయితే ఈ వేడుకలలో ఈ హీరోని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి ఇప్పటికీ వడ్డే నవీన్ చాలా మారిపోయారని అసలు గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వడ్డే నవీన్ కాస్త అధిక బరువు పెరిగినట్టుగా కనిపిస్తోంది. అలాగే ముఖం కూడా కాస్త ఉబ్బినట్టుగా ఉండడంతో పాటుగా ఫేసులో గ్లో కనిపించడం లేదంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత తమ హీరోని చూసామని సంతోషించాల లేకపోతే గుర్తుపట్టలేనంతగా మారిపోయారని బాధపడాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.