టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఇకపోతే తమిళ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా శంకర్ కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఈయన కొంత కాలం క్రితం కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 అనే మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

సినిమా భారీ అపజయాన్ని ఎదురుకోవడంతో శంకర్ కి ఈ సినిమా ద్వారా నెగెటివిటీ భారీగా పెరిగింది. దానితో గేమ్ చేంజర్ సినిమా కనుక కాస్త తేడా కొట్టిన కూడా శంకర్ క్రేజ్ మరింతగా తగ్గిపోతుంది అనే అభిప్రాయాలను చాలా మంది జనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నా కూడా ఈ మూవీ కి చాలా మూవీలు పోటీగా రాబోతున్నాయి. చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10 వ తేదీన విడుదల అవుతూ ఉంటే 12 వ తేదీన బాలయ్య హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , 14 వ తేదీన వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి.

ఇక తమిళ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ కావడంతో తమిళ్లో ఈ మూవీకి మంచి కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ తమిళ్లో స్టార్ హీరో అయినటువంటి అజిత్ హీరోగా రూపొందిన విడ ముయ్యార్చి అనే సినిమాను కూడా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. దీనితో ఈ సినిమాకు తమిళ్లో కూడా కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: