ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది . ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 3 వారాల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది . ఇకపోతే మూడో వారం ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసినప్పటికీ ఓ మీడియం రేంజ్ హీరో నటించిన మూడో వారం సినిమా కలెక్షన్లను మాత్రం పుష్ప దాటలేకపోయింది.

అసలు ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. విడుదల అయిన మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి పార్ట్ 2 సినిమా 18.20 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత తేజా సజ్జ హీరోగా రూపొందిన హనుమాన్ సినిమా 16.01 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మూడవ వారం అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది. ఇక మూడవ స్థానంలో పుష్ప పార్ట్ 2 సినిమా 14.19 కోట్ల కలెక్షన్లతో నిలిచింది.

ఇలా ఈ మూవీ విడుదల అయిన మూడవ వారం అద్భుతమైన కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన హనుమాన్ సినిమా మూడవ వారం వసూలు చేసిన కలెక్షన్లను మాత్రం దాటలేకపోయింది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ లో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa