సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైతే మంచి విజయాలు ఉంటాయో వారికి వరుస పెట్టి అవకాశాలు వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లకు ఎన్ని విజయాలు దక్కితే అన్ని క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అదే వారు నటించిన సినిమాలు కనుక అపజయాల పాలైతే వారికి కూడా సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కానీ కొంత మంది మాత్రం తాము నటించిన సినిమాల్లో అందాలతో , నటనతో ఆకట్టుకున్నట్లయితే వారి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా వరుస అవకాశాలు దక్కుతూ ఉంటాయి.

అలా వరుస ఫ్లాపులు వస్తున్న కూడా అదిరిపోయే రేంజ్ క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో కేతికా శర్మ ఒకరు. ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరో గా రూపొందిన రొమాంటిక్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ బ్యూటీ ఈ సినిమాలో తన అందాలను భారీగా ఆరబోయడంతో ఈమెకు ఆ తర్వాత కూడా అనేక సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన ఏ తెలుగు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. కానీ ఈమె ఇప్పటివరకు చాలా సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ బ్యూటీ కి వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ కి విజయాలు లేకపోయిన అవకాశాలకు మాత్రం కొదవ లేకుండా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వీలు చుక్కినప్పుడల్లా తన సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా కూడా కుర్రకారుకి హిట్ పెంచుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: