టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించగా ... ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా కనిపించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బాబి ఈ మధ్య కాలంలో అనేక ఇంటర్వ్యూలను ఇస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన ఇంటర్వ్యూలో భాగంగా డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా బాబీ కి మీరు డాకు మహారాజ్ సినిమా కోసం బాలకృష్ణ కు మూడు కథలను వివరించగా అందులో ఒక దానిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారట నిజమేనా ..? అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ ... నేను మూడు కథలను బాలకృష్ణకు వినిపించలేదు. మూడు క్యారెక్టరైజేషన్లను వినిపించాను. అందులో డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన మెయిన్ క్యారెక్టర్ ఆయనకు బాగా నచ్చింది. దానినే డెవలప్ చేసి సినిమాగా రూపొందించాం అని బాబి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: