ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ సంక్రాంతి కానుకగా రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ నటించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, వెంకటేష్ హీరోగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగంగా జరుపుతున్నారు.


అయితే ప్రేక్షకులలో ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్న సినిమా ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కాగా, గతంలో రెండుసార్లు హీరో వెంకటేష్ కారణంగా బాలకృష్ణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


2000వ సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. అదే సంవత్సరం వెంకటేష్ నటించిన కలిసుందాం రా సినిమా కూడా విడుదల అయింది. ఆ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలవగా కలిసుందాం రా సినిమా మంచి సక్సెస్ అందుకుంది. బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ఇక 2019 సంవత్సరంలో కూడా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా సంక్రాంతి విడుదల అయింది.

అదే సంవత్సరం వెంకటేష్ హీరోగా చేసిన ఎఫ్2 సినిమా రిలీజ్ అయింది. ఆ రెండు సినిమాలలో వెంకటేష్ నటించిన ఎఫ్ 2 సినిమా బంపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ నటించిన సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ రెండు సందర్భాలలో వెంకటేష్ కారణంగా బాలకృష్ణ నటించిన సినిమా సక్సెస్ అందుకోలేదు. మరి ఈ సంక్రాంతికి కూడా వెంకటేష్, బాలకృష్ణ ఇద్దరూ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. వీరిద్దరి సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అందుకుంటుందో అని ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: