సౌత్ హీరోయిన్స్ అందరిదీ ఒక లెక్క. సాయిపల్లవి ఒక్కరిదీ మరోలెక్క. సెలెక్టెడ్ సినిమాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ మలయాళంలో ఒక రేంజ్ లో అభిమానులను సంపాదించుకుని తెలుగులో ప్రేక్షకులను ఫిదా చేసేసింది ఈ భామ. సాయిపల్లవి సినిమాలో ఉంది అంటే సమ్ థింగ్ స్పెషల్ అనేలా తెలుగులో డీసెంట్ ప్లేస్ పట్టేసింది. సాయిపల్లవి సినిమాలో కనిపించినా సంచలనమే.. కనిపించకపోయినా సంచలనమే. సినిమా హీరోయిన్ అంటే అదీ ఇదీ అని చెప్పే నటీమణుల మధ్యలో తనదంటూ ప్రత్యేకత నిలబెట్టుకున్న సాయిపల్లవి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇదిలావుండగా సాయి పల్లవి గతంలో ఓ వాణిజ్య ప్రకటనను రిజెక్ట్ చేశారు. ఆ యాడ్ చేయడానికి ఆమెకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయి పల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారు.కాస్మోటిక్ కు సంబంధించిన ఆ యాడ్ చేసేందుకు సాయి పల్లవి నిరాకరించారు. సౌందర్య సాధానాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని దీంతో ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని అందుకే తాను ఎలాంటి కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయనని తిరస్కరించారు.

చదివింది వైద్య విద్య అయినా సినీరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.గ్లామర్ కు దూరంగా ఉంటూ సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూ అడియన్స్ గుండెల్లో నిలిచిపోయింది.ప్రస్తుతం సాయిపల్లవి నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో చేస్తోంది. దీని తరువాత సౌత్ నుంచి వచ్చిన ఆఫర్లను వేటినీ ఆమె ఒప్పుకోలేదు. తాజాగా వచ్చిన ఈ భారీ ఆఫర్ కూడా రిజెక్ట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా సాయిపల్లవికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ ఆమె సినిమా ఒక్కటి కూడా విడుదల కాకుండానే ఆమెకు ఆఫర్లు వస్తున్నాయట. బాలీవుడ్ లో అల్లుఅరవింద్ భారీగా తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో సీతగా ప్రస్తుతం సాయిపల్లవి చేస్తోంది. దీంతో పాటు అమీర్ ఖాన్ వారసుడు ఎంట్రీ ఇస్తున్న మూవీలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది. రెండు భారీ ప్రాజెక్టుల్లో మెరవబోతున్న సాయిపల్లవి త్వరలో బాలీవుడ్ లో బిజీ అయిపోయే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: