తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు లవ్ లో పడుతూ ఉంటారు. కానీ కొంతమంది వారి లవ్ విషయాన్ని ఎక్కడ కూడా బయటకు రాకుండా మెయింటైన్ చేస్తూ పెళ్లి వరకు అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా నాగచైతన్య సమంత చాలా ఏళ్లపాటు సీక్రెట్ గా లవ్ చేసుకుని చివరికి పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకున్నారు. అదే కోవలో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ వస్తున్నారు. వీళ్ళిద్దరూ గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ అనే సినిమాల్లో నటించిన తర్వాత వీరి మధ్య లవ్ పుట్టింది. దీంతో అది అలాగే కొనసాగిస్తూ చాలా సీక్రెట్ గా విదేశాల్లో కలుస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరిద్దరూ ఎప్పుడైనా సోషల్ మీడియాలో వేరు వేరు  ఫోటోలు పెట్టినా కానీ ఇద్దరు ఒకే లొకేషన్ నుంచి ఫోటోలు పెట్టడం వల్ల చాలామంది నేటిజన్స్ వీరు కలిసే ఉంటున్నారని భావించారు. 

అలా సీక్రెట్ గా  మైంటైన్ చేసినా కానీ వీరి లవ్ విషయం మాత్రం రోజు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ త్వరలో బ్రేకప్ చెప్పుకోబోతున్నారని ఒక వార్త నెట్టింటా  దారుణంగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ కు బ్రేకప్ చెప్పబోతున్నారట. దీనికి ఒక కారణం కూడా ఉందట.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఇద్దరు పాన్ ఇండియా స్టార్లుగా మారారు. కానీ  విజయ్ దేవరకొండ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో చేసిన సినిమాల్లో లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది.

కానీ రష్మిక మందాన చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన హిట్లు సాధించడంతో ఆమె పేరు ఎక్కడికో వెళ్లిపోతోంది. దీంతో తనకంటే రష్మికానే హయ్యర్ పొజిషన్ లో ఉందని భావించిన  విజయ్ దేవరకొండ ఆమెకు బ్రేకప్ చెప్పబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త విన్న నేటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి ఒక పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోస్ట్ ను బట్టి చూస్తే కూడా వీరి ప్రేమ విషయంలో ఏదో తేడా కొడుతుందని అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: