ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా మూడు సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి సినిమాలు యావరేజ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ఒకవేళ హిట్ టాక్ వస్తే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. 2025 సంవత్సరం సంక్రాంతి కనుక టాలీవుడ్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ - బాలయ్య డాకు మహారాజ్ - వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాలలో గేమ్ ఛేంజర్ రు . 300 కోట్ల షేర్ వస్తే హిట్ అవుతుంది. డాకు మహారాజ్ మూవీ టార్గెట్ 100 కోట్లు .. సంక్రాంతి వస్తున్నాం సినిమా టార్గెట్ 60 నుంచి 70 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. నైజాంలో థియేటర్ల విషయంలో ఏ సినిమాకు అన్యాయం చేయకుండా దిల్ రాజు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దీనికి ప్రధాన కారణం గేమ్ ఛేంజర్ - సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దిల్ రాజు సొంత సినిమాలు. ఇక డాకు మహారాజు సినిమాలో నైజాంలో ఆయనే పంపిణీ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మరియు భారీ టార్గెట్ లేకపోవడం .. అనిల్ రావిపూడి ఇప్పుడు సక్సెస్ ట్రక్ లో ఉండటం వెంకటేష్ కు సరిపోయే కాన్సెప్ట్ మూవీ కావటం .. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక బాలయ్య మూడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఉన్నారు. డాకు మహారాజ్ సినిమాకు హిట్ టాక్ వస్తే 100 కోట్ల కలెక్షన్లు చాలా సులువుగా వస్తాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో రామ్ చరణ్ సినిమాకు అంత సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనపడటం లేదు.