- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో 23 సంవత్సరాలు క్రితం విక్టరీ వెంకటేష్ - ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా పేరు వినగానే పింకీ అనే పాత్ర పోషించిన అమ్మాయి గుర్తుకు వస్తుంది. ఆమె అసలు పేరు సుదీప అయినా పింకీ గానే ఎక్కువ మందికి తెలుసు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప మాట్లాడుతూ తన కెరీర్ గురించి అనేక విషయాలు అభిమానాలతో పంచుకున్నారు. సుదీప స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం. ఆమె 9వ తరగతి చదువుతున్న సమయంలో నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక వైపు సినిమాలు చేస్తూ తాడేపల్లిగూడెంలో నే డిగ్రీ వరకు చదివింది అట . . ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు.


నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు ముందు ఒకటి రెండు సినిమాలు చేశాను ... ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వెళ్ళను .. ఇప్పటికే వంద సినిమా లు పూర్తి చేసినట్టు పింకీ చెప్పింది. వెంకటేష్ గారితో మాత్రమే కాదు చిరంజీవి గారితో పాటు చాలామంది స్టార్స్ తో కలిసి నటించాను . . ఒక్క నాగార్జున గారు సినిమాలో చేయడమే కుదరలేదు .. నా కెరియర్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి బిజీగానే ఉంటూ వచ్చాను .. ముందు సినిమాలు పెళ్లి తర్వాత సీరియల్స్‌ చేస్తూ వెళ్లాను .. నాకు నేనుగా వెళ్లి ఎవరిని అవకాశాలు అడగలేదు అంత అవసరం కూడా రాలేదు అని సుదీప చెప్పారు. ఇక నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రలో ఆర్తి అగర్వాల్ పక్కన వెంకటేష్ ను ఆటపట్టించే చిన్నపిల్లగా సుదీప్ నటన అదరగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: