2024 వ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియబోతుంది. ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకు బాగానే కలిసి వచ్చింది. ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమ నుండి చాలా సినిమాలు విడుదల కాగా అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకుంటే మరికొన్ని సినిమాలు పరవాలేదు అనే స్థాయి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో నుండి వచ్చిన కొన్ని పాటలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇక మరికొన్ని పాటలు సినిమా స్థాయిని కూడా పెంచే విధంగా ప్రేక్షకులను అదరగొట్టాయి.

అలాంటి పాటలలో కమిటీ కుర్రాళ్ళు మూవీలోని ఆ రోజులు మళ్లీ రావు అనే సాంగ్ ఒకటి. యదు వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనేక మంది కొత్త నటులు నటించారు. కొత్త నటులే అయినప్పటికీ ఈ సినిమాలో నటించిన అందరూ నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఒక చిన్న గ్రామంలో కలిసి మెలిసి ఉంటున్న కొంత మంది స్నేహితుల మధ్యలో ఒక సమస్య రావడం , దాని ద్వారా వారు విడిపోవడం. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు మల్లి వారు కలవడం అనే కథతో ఈ సినిమా ముందుకు సాగుతోంది.

ఇక ఈ కథ అద్భుతంగా ఉండడం , స్క్రీన్ ప్లే అంతకుమించిన స్థాయిలో ఉండడం మాత్రమే కాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ గా ఉండడంతో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు. ఈయన ఈ సినిమాకు అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఆ రోజులు మళ్లీ రావు పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికి కూడా ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: