టాలీవుడ్ ఇండస్ట్రీలో... చాలా రకాల డ్యాన్స్ మాస్టర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఒకరు మాస్ సాంగ్స్ లో పాపులర్ అయితే... మరి కొంతమంది కొరియోగ్రాఫర్లు... క్లాసిక్ పాటలకు హిట్ అవుతూ ఉంటారు. ఏదో ఒక విభాగంలో డాన్స్ మాస్టర్లు పాపులర్ ఇండస్ట్రీలో రాణిస్తారు. లేకపోతే అలాంటి డాన్స్ మాస్టర్లు మన... ఇండస్ట్రీలో.. పైకి ఎదగరు. అయితే ఈ 2024 సంవత్సరంలో... గణేష్ ఆచార్య... దుమ్ము లేపాడని చెప్పవచ్చు.
కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతనిది మహారాష్ట్ర అయినప్పటికీ... టాలీవుడ్ ఇండస్ట్రీని ఈ సంవత్సరంలో షేక్ చేశాడు. లావుగా బొద్దుగా ఉన్నప్పటికీ... ఆయన వేసే స్టెప్పులు మాత్రం ఇప్పటికీ అందరికీ కళ్ళల్లో మెదులుతాయి. ఈ సంవత్సరంలో... జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోని ఆయుధ పూజా తో పాటు, సూసేకి కిస్సిక్, రా మచ్చా మచ్చా అనే పాటలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు గణేష్ ఆచార్య.
ఇక పుష్ప 2 సినిమాను సూసేకి పాట చిన్నపిల్లలను కూడా ఆకట్టుకుంటుంది. ఈ 2024 సంవత్సరంలో ఈ 4 పాటలు ఆల్మోస్ట్... బంపర్ హిట్ అయ్యాయి. ఈ సంవత్సరంలో ముగ్గురు బడా టాలీవుడ్ హీరోలతో... సినిమాలు చేసి.... మన తెలుగు కొరియోగ్రాఫర్లను బీట్ చేశాడు గణేష్ ఆచార్య. ఆయన చేసిన ఈ నాలుగు పాటల్లో.... టాప్ మోస్ట్ హీరోలే ఉండడం గమనార్హం.
రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ లో రా మచ్చా మచ్చా అనే పాట యూట్యూబ్ ను చెక్ చేయడం జరుగుతుంది. అలాగే అల్లు అర్జున్ చేసిన పుష్ప 2 సూసేకి, కిసాక్ అనే రెండు పాటలు కూడా ఆల్మోస్ట్ బంపర్ హిట్ కావడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర సినిమాలోని ఆయుధ పూజ పాట కూడా అన్నిటికంటే పెద్ద హిట్ అని చెప్పవచ్చు. ఈ నాలుగు పాటల్లో హీరో అలాగే హీరోయిన్ల స్టెప్పులు అదిరిపోయాయి.