చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే నిర్మాతలకు సినిమా ఇండస్ట్రీలో ప్రథమ స్థానం ఉండేది. హీరోలు సైతం నిర్మాతలు వచ్చారు అంటే లేచి నిలబడి దండం పెట్టే సంస్కృతి మన తెలుగు సినీ పరిశ్రమలో ఉండేది. దానికి ప్రధాన కారణం నిర్మాతలు ఓ కథను నమ్మి ధైర్యంతో డబ్బులు పెడతారు. ఒక వేళ అది సక్సెస్ అయితే వారికి డబ్బులు వస్తాయి. అదే ఫెయిల్యూర్ అయితే వారు పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోతారు. సినిమా హీరోకు , ఇతర నటీనటులకు నిర్మాతలు డబ్బులు ఇచ్చేస్తారు. దాని వల్ల టోటల్ రిస్క్ నిర్మాతలకు ఉంటుంది.

అలా ఎంతో రిస్క్ చేస్తూ తమపై సినిమాలను నిర్మిస్తున్నందుకు నిర్మాతలకు స్టార్ హీరోలు సైతం ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఇది కరువైపోయింది అనే వాదన అనేక మంది అనేక సార్లు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోలు , నిర్మాతల కంటే కూడా ఎక్కువ డామినేట్ చేస్తున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. వారి డామినేషన్ వల్ల నిర్మాతలకు పెద్దగా లాభాలు రావడం లేదు అని వాదనను కూడా కొంత మంది వినిపిస్తున్నారు. ఇక ఎంతో రిస్క్ చేసి ఎన్నో కోట్ల డబ్బులు ఖర్చు పెడుతున్నా సినిమా హిట్ అయితేనే వారికి కాస్త కూస్తో లాభాలు వస్తున్నాయి.

అని అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడితే తీవ్రంగా నష్టాలు వస్తున్నాయి అని అందుకే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు ఎక్కువ కాలం కొనసాగ లేక పోతున్నారు అనే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు. ఇలా నిర్మాతలు ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే హీరోలు , హీరోయిన్లు తమ పారితోషకాన్ని తగ్గించుకోవాలి అనే వాదనను కూడా కొంత మంది వినిపిస్తున్నారు. ఏదేమైనా కూడా హీరోల డామినేషన్ తగ్గితేనే నిర్మాతలు కాస్తో కూస్తో లాభాలు అందుకొని ఎక్కువ కాలం కెరీర్ను కొనసాగిస్తారు అనే వాదనను చాలా మంది వినిపిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: