అల్లు అర్జున్ ఎప్పుడైతే పుష్ప-2 తొక్కిసలాట ఘటనలలో అరెస్ట్ అయ్యారు. అప్పటినుండి ఈయనపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ పెరిగిపోయింది.. చాలామంది అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాకి నేషనల్ అవార్డు ఇవ్వడం తప్పుగా భావిస్తున్నారు. ఎర్రచందనం దొంగతనం చేసే వాడికి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటి అని తప్పు పడుతున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ నటన చూశారు.కానీ ఆయన ఏ పాత్రలో నటించారు అనేది మాత్రం పట్టించుకోలేదు. ఇక ఈ పుష్ప టు పుష్ప వన్ సినిమాలో అల్లు అర్జున్ నటన ఏ లెవెల్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.ఈ జనరేషన్ లో అలాంటి యాక్టింగ్ చేసే హీరో ఎవరూ లేరు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే అలాంటి అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

ఆయన అరెస్టు ఇవ్వడం ఒకెత్తయితే  అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటలకు వివరణ ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం మరో ఎత్తు. ప్రెస్ మీట్ కారణంగా బన్నీ జనాల్లో బ్యాడ్ అయిపోయారు. తగ్గేదేలే అంటూ పోలీసులు బన్నీ చెప్పినవి అబద్ధపు మాటలు అని కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. దాంతో బన్నీ అబద్ధాలు ఆడుతున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అల్లు అర్జున్ పై సంచలన కామెంట్లు చేశారు.అసలు అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకి నేషనల్ అవార్డు అవసరమా..

 ఆయనకు పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిందని తెలియగానే నేను చాలా ఆశ్చర్యపోయాను.నాకు సర్ప్రైజింగ్ అనిపించింది.. ఆ సినిమా కంటే విక్కీ కౌశల్ నటించిన సర్దార్ ఉద్ధమ్ సినిమాలోని విక్కీ కౌశల్ నటనకి నేషనల్ అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రేక్షకుల అభిప్రాయాలను దృష్టిలోకి తీసుకోవాలి.ఆర్ట్ అనేదాన్ని లెక్కలతో పోల్చకూడదు అంటూ అమీర్ ఖాన్ సంచలన కామెంట్లు చేశారు.మొత్తంగా అసలు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వ్వడమే వేస్ట్ అన్నట్లుగా అమీర్ ఖాన్ మాట్లాడడంతో బన్నీ అభిమానులు అమీర్ ఖాన్ పై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: