మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం నవీన్ పోలిశెట్టి హీరోగా స్టార్ట్ అయిన అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక ఈ సినిమాను ఆపేశారు.

చాలా కాలం పాటు ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ను మళ్ళీ తిరిగి కొంత కాలం క్రితమే మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ ఓ వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో భాగంగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దానితో శ్రీ లీల ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు అర్థం అయిపోయింది. మరి శ్రీ లీల ఈ సినిమా నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం అనగనగా ఓ రాజు సినిమా చాలా కాలం క్రితం ప్రారంభం అయింది.

కానీ ఆ తర్వాత ఈమె క్రేజ్ భారీగా పెరగడంతో వరుస సినిమా అవకాశాలు ఈమెకు వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నాగ చైతన్య హీరోగా రూపొందబోయే సినిమాలో , అఖిల్ హీరోగా రూపొందబోయే సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా అనేక మంది హీరోల సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండడంతో అనగనగా ఒక రాజు సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ బ్యూటీ ఆ సినిమాను వదిలి వేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: