టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మణులతో సాయి పల్లవి ఒకరు . ఈమె మలయాళ సినిమా ప్రేమమ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఫిదా అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని తన నటనతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ సాలిడ్ గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకోకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉండి , గ్లామర్ షో కి అవకాశం లేని పాత్రలను ఎంచుకుంటూ కెరియర్ను ముందుకు సాగిస్తోంది. దానితో ఈమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ టాలీవుడ్ నటుడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ హీరో గా బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే టైటిల్ తో  ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ లో హీరోయిన్ గా వేణు , సాయి పల్లవి ని సెలెక్ట్ చేసుకున్నట్లు , అందులో భాగంగా ఆమెను సంప్రదించి కథను వివరించగా ఆమె కూడా నితిన్ హీరోగా రూపొందబోయే ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే నితిన్ హీరో గా వేణు దర్శకత్వంలో రూపొందబోయే ఎల్లమ్మ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: