ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న  అన్ స్టాపబుల్ షోకి ఎంతోమంది గెస్టులుగా హీరోలు, హీరోయిన్స్ ,డైరెక్టర్లు, నిర్మాతలు సైతం రావడం జరిగింది. ఇప్పుడు నాల్గవ సీజన్ 6 ఎపిసోడ్ అవ్వగా ఏడో ఎపిసోడ్ తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి హీరో వెంకటేష్ వచ్చి సందడి చేయడం జరిగింది. అటు బాలయ్య ఇటు వెంకటేష్ ఇద్దరూ కూడా కలిసి కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు సంబరపడిపోతున్నారు. అలాగే వెంకటేష్ కూడా ఈ షోల తన గురించి సినిమాల గురించి తెలియజేయడం జరిగింది.


వెంకటేష్ ఫారెన్ లో చదివి హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య అసలు నువ్వు హీరో కాకపోతే ఏం అయ్యేవాడివి అని ప్రశ్నించగా?.. అందుకు వెంకటేష్ సమాధానాన్నిస్తూ తను ఫారెన్  కి వెళ్లి ఎంజాయ్ చేయాలని ఉండేది కాలిఫోర్నియా బీచ్ లో ఒక ఇల్లు కట్టుకొని అక్కడే స్థిరపడిపోవాలనుకున్నానని కానీ అది కుదరకే ఇక్కడ ఒక బిజినెస్ పెట్టాను అంటూ తెలిపారు. అది ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత తన తండ్రి రాఘవేంద్రరావు గారిని పిలిచి తన కొడుకు ఉన్నాడు అని చెప్పగా కలియుగ పాండవులు సినిమాను చేశామని తెలిపారు.


అయితే ఈ సినిమాతో ఒక ట్రైల్ వేద్దామని సినిమాలు మొదలు పెట్టానని తెలిపారు హీరో వెంకటేష్ అలా ఇప్పటికీ కూడా హీరోగా ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించారట. వెంకటేష్ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చేయేడాది 14వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కూడా నటించారు. అలాగే ఈ షోకి వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు కూడా రావడంతో పాటు అనిల్ రావిపూడి కూడా కనిపించడం జరిగింది. మొత్తానికి వెంకటేష్ హీరో కాకపోయి ఉంటే బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అవ్వాలనుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: