- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో ఇటీవ‌ల జ‌రిగిన సంథ్య థియేట‌ర్ గొడ‌వ త‌ర్వాత పెద్ద ర‌చ్చ జ‌రిగింది. గ‌త పది హేను రోజులు గా ఈ విషయం అటు మీడియా వర్గాల్లో సినిమా వర్గాల్లో తెలుగు రాజకీయ వర్గాలలో ఎలాంటి సంచలన విషయంగా మారిందో చూస్తూనే ఉన్నాం. ఈ పరిణామాలు టాలీవుడ్ ను చిగురుటాకుల వణికించాయి. బెనిఫిట్ షోల రద్దు .. టికెట్ల ధరల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు టాలీవుడ్ వర్గాలలో ఆందోళన రేకెత్తించాయి. ఇక టాలీవుడ్ కు ఏపీనే గమ్యస్థానం అని కూడా చాలామంది భావించారు. ఈ అవకాశాన్ని సీఎం చంద్రబాబు అందిపుచ్చుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు పూర్తిగా మౌనం వహించారు. నిజంగా ఈ టైంలో చంద్రబాబు జోక్యం చేసుకుని టాలీవుడ్ కు అనుకూలంగా చర్చించేందుకు రెడీ అయి ఉంటే హైదరాబాద్ తో పాటు సమాంతరంగా విశాఖ - అమరావతి లాంటి నగరాలలో సినీ పరిశ్రమ ఎంతో కొంత డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్న చర్చి జరిగింది.


అయితే ఈ విషయంలో చంద్రబాబు సుదీర్ఘంగా మౌనం పాటించారు. ఈ టైంలో చంద్రబాబు టాలీవుడ్ ను ఏపీకి ఆహ్వానించి ఉంటే బాగుంటుందని అందరూ అనుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు 2014లో గెలిచినప్పటి నుంచి టాలీవుడ్ ను కొంతవరకు అయినా ఏపీకి తీసుకువచ్చే విషయంలో సీరియస్ గా జోక్యం చేసుకొని ఉంటే బాగుండేదని .. పైగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా సినిమా హీరో పవన్ కళ్యాణ్ ఉన్నారని .. ఆయన కూడా పట్టి పట్టినట్టు ఉండడంతో టాలీవుడ్ తిరిగి తెలంగాణనే మచ్చిక చేసుకుంద‌ని అంటున్నారు. ఏదేమైనా చంద్ర‌బాబు ఇండ‌స్ట్రీ ని ఏపీకి తీసుకు వ‌చ్చే అంశం పై పెద్ద గా కాన్ సంట్రేష‌న్ చేస్తోన్న ప‌రిస్థితి అయితే క‌న‌ప‌డ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: