తన కామెంట్స్ ని అనవసరంగా ట్రోల్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనంతరం ఆయన ఇంటర్వ్యూలో బన్నీ గురించి మాట్లాడుతూ.. తనకు సోషల్ మీడియలో ఏదైనా చూడాలంటనే ఇష్టం ఉండదని అన్నారు. పెద్దగా ఆయన సోషల్ మీడియాని ఫాలో అవ్వరని తెలిపారు. అయితే ఇటీవల తాను బన్నీని ఏదో అన్నారని వస్తున్న వార్తల గురించి తనకు ఎవరో పంపించారని చెప్పారు. అల్లు అర్జున్ ని తాను ఏదో అనడమేంటని.. చిన్నప్పటి నుంచి బన్నీ తనకి తెలుసని చెప్పుకొచ్చారు. బన్నీ తన కొడుక్కి ఫ్రెండ్ అని.. వాడి గురించి తాను ఎందుకు ఏదో అంటానని.. అలా ఎలా రాశారని ఆయన ఫైర్ అయ్యారు. తాను అన్నానని డైరెక్ట్‌గా చెప్పలేదని కానీ మేబీ అని రాశారని.. ఎందుకలా రాయడం అంటూ సురేష్ బాబు మండిపడ్డారు.
ఇకపోతే సురేష్ బాబు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అందరికీ చాలా విషయాలు నేర్పుతుంది. ఇలాంటివి జరగాలని ఎవరూ కోరుకోరు కానీ జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందే. ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్స్ చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలా పబ్లిసిటీ ఎక్కువ అవ్వడం వల్ల జనాలు విపరీతంగా వస్తున్నారు. వాళ్లని కంట్రోల్ చేయడం కష్టం అయిపోయింది. ఇక పిల్లలతో రద్దీగా ఉన్న ప్రాంతాలకి వెళ్లినప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎలా ఉండాలి.. ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది పిల్లలకి ముందే చెప్పాలి.. మీ ఇంట్లో నువ్వు ఎగురు, డ్యాన్ చెయ్, ఏమైనా చెయ్.. కానీ బయటికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా.. ఇవన్నీ ఇంట్లో చెప్పాలి' అంటూ ఆయన చెప్పిన విషయం తెలిసిందే.